సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం గుమ్మ ళ్ళ దొడ్డి వద్ద సుమారు రూ.270 కోట్లతో అసాగో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్న బయోఇథనాల్ యూనిట్ నిర్మాణ పనులకు ముఖ్య మంత్రి, వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ కార్య క్రమం లో టెక్ మాహీంద్ర సీఈఓ, సీపీ గుర్నానీ, ఆశీష్.. మంత్రులు గుడివాడ అమర్నాధ్, తానేటి వనిత, దాడిశెట్టి రాజా, వేణుగోపాలకృష్ణ, ఎం పీలు. భరత్ రామ్ , అనురాధ, వంగా గీతా, ఎమ్మెల్యే లు జ్యోతుల చంటిబాబు పాల్గొన్నారు. శంకుస్థాపన అనంతరం ఏర్పా టు చేసిన బహిరంగసభలో సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘దేవుడి దయతో ఈ ప్రాం తానికి మంచి చేసే ప్లాం ట్ రాబోతోంది. రూ.270 కోట్లతో టెక్ మహీంద్రా గ్రూప్ ఇథనాల్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తోంది. పరిశ్రముల నెలకొల్పేందుకు రాష్ట్రంలో మంచి వాతావరణం ఉంది. కేవలం ఆరు నెలల కాలంలోనే అనుమతులు మంజూరు చేసి.. ఈ రోజు భూమి పూజ కూడా చేశాం. 2లక్షల లీటర్లసామర్థ్యంతో ప్లాంట్ రాబోతుంది. ఈ గ్రీన్‌ఫీల్డ్ యూనిట్ రోజుకు 200 కిలోలీటర్లబయో ఇథనాల్ ఉత్పత్తి అవుతుంది. ఈయూనిట్ ద్వారా ప్రత్యక్షం గా 100 మం దికి, పరోక్షంగా 400మందికి స్థానికులకు ఉపాధి లభించనుంది. బ్రోకెన్ రైస్ ప్లాంట్‌లో ఇథనాల్ తయారీ చేస్తారు. ప్లాంట్‌తో పాటు బై ప్రోడక్ట్ కింద పశువుల దాణా, చేపల మేతకు ఉపయోగపడే ప్రోటీన్ ఫీడ్ కు డా అందుబాటులోకి వస్తుంది. ఇకపై రంగు మారిన ధాన్యా నికి కూడా మంచి ధర లభిస్తుంది’ అని సీఎం జగన్ అన్నారు.
