సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఒక అమ్మాయి ప్రేమ వ్యవహారంలో..? భీమవరం లోని ఎస్‌ఆర్‌కె‌ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఐదుగురు విద్యార్థులు గొడవపడ్డారు. అంకిత్ అనే విద్యార్థిపై మరో నలుగురు విద్యార్థులు ప్రవీణ్, ప్రేమ్, స్వరూప్, నీరజ్ వారి హాస్టల్ రూంలో చుట్టుముట్టి కర్రతో కొడుతూ దాడి చేశారు. ఈ ఘటనలో అంకిత్ గాయాలు పాలు అవ్వడంతో అతను భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. (దీనిని సెల్ వీడియోలో చిత్రించడం కూడా జరిగింది.) ఇంజనీరింగ్ సెకండీయర్ చదువుతున్న ఈ ఐదుగురు శ్రీకాకుళం, రాజమండ్రి‌కి చెందినవారు. వారి తల్లితండ్రులు అంత దూరం నుండి చదువుకోమని పంపితే ఈ ఇంజనీరింగ్ విద్యార్థుల ఘర్షణ.. ఒకనిపై దాడి చేసిన విషయంపై స్పందించిన SRKR కాలేజీ ప్రిన్సిపాల్, జగపతి రాజు నేడు, శుక్రవారం..ఆ ఐదుగురు విద్యార్థులను ముందుగా కళాశాల నుంచి క్రమశిక్షణ చర్యల క్రింద సస్పెండ్ చేశారు. ఈ సంఘటనపై పూర్తి విచారణ చేసి అసలు దోషులు ఫై కఠిన చర్యలు తీసుకుంటాం అని ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *