సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజా వార్త కధనాల ప్రకారం.. తెలంగాణలో టీఆరెస్ ఎమ్మె ల్యే లకు బీజేపీ లో చేరేందుకు 50 కోట్ల రూపాయలు చప్పున ఎర’ వేస్తున్నారన్న కేసుఫై కేంద్ర దర్యా ప్తు సంస్థ(సీబీఐ) లేదా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యా ప్తు జరిపించాలని కోరుతూ ..తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ నేరు గా ప్రమేయం ఉన్న ఈ కేసులో పోలీస్విచారణ సక్రమం గా సాగుతుందన్న నమ్మకం మాకు లేదు. మాకు బెయిల్ ఇవ్వమని ట్రయల్ కోర్టు ఇచ్చిన ఆదేశాలు పక్కన పెడుతూ హైకోర్టు రిమాండ్ విధించడాన్ని… సవాల్ చేస్తూ రామచంద్ర భారతి తదితరులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీం కోర్ట్ జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ బీవీ నాగరత్నలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. దీనిపై విచారణలో … ఈ వ్యవహారం పై రాజకీయ పార్టీ కోర్టుకెందుకు వెళ్ళింది. ఆ పిటిషన్ను హైకోర్టు ఎలా స్వీకరించిందని సుప్రీంకోర్టు ఆశ్చర్యం వ్య క్తం చేసింది. పిటిషనర్లతరఫు సీనియర్ న్యాయవాది విశ్వ నాథన్ వాదనలు వినిపిస్తూ.. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధం గా పిటిషనర్లను అరెస్టు చేశారని తెలిపారు. సాధారణ పోలీసులు వచ్చి ట్రాప్ చేసినట్లు పేర్కొ న్నా రు. నగదు దొరికిన ట్రాప్ కేసుల్లోనూ అదే రోజూ బెయిలు ఇస్తున్నా రు కదా అని జస్టిస్ బీఆర్ గవాయి ప్రశ్నించారు.. ఓ పార్టీ పిటిషన్ దాఖలు చేయడం , హైకోర్టు విచారణకు స్వీ కరిం చడం ఏంటని జస్టిస్ బీఆర్ గవాయి ఆశ్చర్యం వ్య క్తం చేశారు. ‘ఏదేమైనా ప్రస్తుత పిటిషన్, హైకోర్టులో పిటిషన్లు పెండింగ్లో ఉన్నా .. పిటిషనర్లు బెయిల్ దరఖాస్తును ట్రయల్ కోర్టు న్యాయమూర్తి పరిశీలించడానికి అడ్డంకి కావు. మెరిట్స్ పై దరఖాస్తులు పరిగణనలోకి తీసుకోవాలని ట్రయల్ కోర్టుకు చెప్పాల్సిన అవసరం లేదు అని సూచిస్తూ సుప్రీంకోర్టు కేసు విచారణాను వాయిదా వేసింది.
