సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలంగాణ రాష్ట్రము, మేడ్చల్ జిల్లాలో నేడు, శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుం ది. జవహార్ నగర్ పరిధిలో ఉన్న మల్కా రం లోని ఎర్రగుంట చెరువులో ఈతకు దిగి ఆరుగురు మృతి చెందారు. స్థానిక మదర్సా పాఠశాలలో చదివే విద్యా ర్థులను ( 14 ఏళ్ళ లోపు వయస్సు వారే) విహారానికి ఉపాధ్యాయుడు బయటికి తీసుకెళ్లారు. ఈత కొట్టడానికి ఎర్రగుంట చెరువులోకి విద్యా ర్థులు దిగారు. చెరువు లోతుగా ఉండడంతో మునిగిపోతున్న విద్యార్థులను కాపాడడానికి ఉపాధ్యాయుడు కూడా దిగారు. అయితే పిల్లలంతా కంగారుగా ఉపాధ్యా యుడ్ని పట్టుకోవడం తో బయటికిరాలేక అందరూ మునిగిపోయారు. సమాచారం అం దుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాలను వెలికితీశారు. మృతులను హైదరాబాద్ నగరంలోని కాచిగూడలోని నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. జాఫర్, సోహేల్, అయాన్, రియాన్.. వీరిని కాపాడేం దుకు చెరువులో దూకిన ఉపాధ్యాయుడు యోహాన్గా గుర్తించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *