సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పట్టణం లోని మార్కెట్ యార్డ్ దగ్గర స్వర్గీయ వై ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి నేడు, ఆదివారం స్థానిక వైసిపి నేతలు, ప్రజా ప్రతినిధులు పుష్ప మాలలు వేసి , జోహార్ వై వైస్ ఆర్ … జై జగన్ అంటూ నినాదాలు చేసారు. ఈ కార్యక్రమం లో వక్తలు మాట్లాడుతూ.. మహానేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి తనయుడు జననేత వై.య‌స్‌.జగన్ ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభించి నాలుగేళ్లు పూర్తీ అయ్యి నేటికి ఐదవ ఏడాదిలో అడుగిడిన సందర్భంగా నాటి పాదయాత్ర మ‌రియు ప్రజలు ఇచ్చిన ఘన విజయంతో గత 3ఏళ్లుగా 99 శాతం హామీలు అమలుతో జ‌గ‌న‌న్న ప్రజా సంక్షేమ ప‌రిపాల‌న‌ను మరోసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని ప్రకటించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి వేడుక నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *