సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: 2వ విడుత కరోనా తరువాత సినిమా థియేటర్స్ కు అసలు జనం వస్తారా? వాటి భవితవ్యం ఏమిటి? అన్న ప్రశ్నల కు బాలయ్య అఖండ సంచలన విజయం తిరుగులేని సమాధానం చెప్పింది. ఇక రాబోయే భారీ సినిమాలకు అఖండ విజయం హారతులు పలికింది. టికెట్ రేట్లు తగ్గించిన 100 కోట్ల క్లబ్ లో చేరిపోయింది. ఈ నేపథ్యంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యక పూజలు నిర్వహించారు, సినీ హీరో నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను, మిర్యాల రవీందర్ రెడ్డి. ఈ నేపథ్యంలో నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘అఖండ’ సినిమా అఖండమైన విజయంతో అమ్మవారిని దర్శించుకున్నాం.ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడిన సినిమా ‘అఖండ’. ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షక దేవుళ్లకి కృతజ్ఞతలు. . అమ్మవారి అశీస్సులతో ‘అఖండ’ సినిమా దిగ్విజయంగా ప్రదర్శింపబడుతుంది.ఏపీలో టిక్కెట్ల రేట్ల తగ్గింపు ఉన్నపటికీ లాభాలు, లెక్కలు ప్రక్కన పెట్టి . ఏదైతే అదని సినిమా విడుదల చేసాం. సినిమా మంచిగా వచ్చిందని డేర్ స్టెప్ వేశాం. కొంతమంది సినిమాలు ఆగినా..మేమెక్కడా వెనుకడుగు వేయలేదు. ‘అఖండ’ సినిమా విజయంతో మిగతా వారికి ధైర్యం వచ్చింది.. తాజాగా హైకోర్టు తీర్పు ఫై ప్రభుత్వం అప్పీల్‌కు వెళ్తామంటున్నారు చూద్దాం. న్యాయ నిర్ణేత దేవుడే… దేవుడున్నాడు. నా వంతుగా నేను గతంలో మాట్లాడాను. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. దాని బట్టి స్పందిస్తా..అని చాల బాలన్స్ గ మాట్లాడారు బాలయ్య..
