సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలో స్థానిక ప్రముఖ ఇంజినీరింగ్ కాలేజీ కి చెందిన విద్యార్థి బి.అంకిత్ ఫై హాస్టల్ గదిలో అదే కాలేజీకి చెందిన మరో 4 విద్యార్థులు కర్రలతో దాడి ఘటన ..తదుపరి వారిని కాలేజినుండి సస్పెండ్ చేసిన ఘటనలు.. మన సిగ్మా న్యూస్ లో గత శుక్రవారం వెలుగులోకి వచ్చిన విషయం అందరికి విదితమే.. అయితే ఈ ఘటనకు సంబంధించి అతడిని గాయపరిచిన సహ విద్యార్థులు నలుగురిని పోలీసులు గత శనివారం అరెస్టు చేశారు ఈ కేసులో తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన బి.జ్ఞాన సత్య స్వరూప్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన బి.ప్రేమ్ కుమార్, డి.ప్రవీణ్, కె.నీరజ్ కుమార్ లను అరెస్టు చేసి భీమవరం న్యాయస్థానంలో హాజరుపరచగా నలుగురు నిందితులకు కోర్ట్ రిమాండ్ విధించినట్లు భీమవరం 2 టౌన్ సీఐ బి.కృష్ణకుమార్ తెలిపారు.
