సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం లో స్థానిక ఎమ్మెల్యే గ్రంధిశ్రీనివాస్ కార్యాలయం వద్ద నేడు, బుధవారం ఉదయం స్వర్గీయ పొట్టి శ్రీరాములు 69 వ వర్ధంతి ని స్మరిస్తూ ఆయన త్యాగాలకు ఘన నివాళ్లు అర్పించడం జరిగింది. తెలుగు వారికీ ప్రత్యేక రాష్ట్రము కోసం తన తుదిశ్వాస వరకు పోరాడారన్నారు. అప్పటి మద్రాసు రాష్టం నుండి తెలుగు వారి గుర్తింపు కోసం అభివృద్ధి కోసం ప్రత్యక బాషా ప్రయుక్త రాష్ట్రము కోసం సుదీర్ఘ కాలం ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ప్రాణాలర్పించిన అమరజీవి మహాపురుషుడు శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వారి ఆత్మాభిమానానికి ప్రతీక అని పేర్కొంటూ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఘన నివాళ్లు అర్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసిపి నేతలతో పాటు పలువురు ముస్లీమ్ పెద్దలు కూడా పాల్గొని అమరజీవి కి పుష్ప మాలలతో నివాళ్లు అర్పించారు. ఆదివారం బజారు సెంటర్ లోని శ్రీ పొట్టిశ్రీరాములు విగ్రహానికి పలువురు స్వచ్చంద సేవకులు, రాజకీయపార్టీల నేతలు, ఆర్యవైశ్య ప్రముఖులు పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు.
