సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తన కార్యాలయంలో నేడు, బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే జనవరి 1 వ తేదీ నుండి వృద్దులకు పెంక్షన్ 2500 రూపాయలకు సీఎం జగన్ పెంచుతున్నారని ప్రకటించారు. గతంలో ఎన్నికల ప్రచారంలోజగన్ 4విడుతలలో పెంక్షన్ పెంచుతానని హామీ ఇచ్చినట్లుగానే తాను అధికారంలోకి రాగానే 2000 రూపాయలు నుండి 2250 కి పెంచి ఇప్పుడు,రానున్న 2022 ఏడాది నుండి 2500 రూపాయలకు పెంచడం హర్షణీయం అన్నారు. కరోనా సమయంలో గత 2 ఏళ్లుగా ప్రభుత్వానికి ఎంతటి నష్టం వచ్చిన ఇచ్చిన మాటకోసం, సీఎం జగన్ లబ్దిదారులయిన వృద్దులకు పెంక్షన్ పెంచడం జరిగిందని 2013 లో 22750 రూపాయలకు 2014నాటికీ 3000 రూపాయలు పెంక్షన్ ను వృద్దులు అందుకొంటారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భరోసా ఇచ్చారు.
