సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: విశాఖపట్నంలో నేడు, శనివారం ఏయూగ్రౌండ్స్ లో నిర్వహిం చిన భారీ బహిరంగ సభలో 2లక్షల పైగా ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించారు.‘ప్రియమైన సోదరీసోదరులారా.. నమస్కారం..’ అంటూ ప్రజలకు తెలుగులో అభివాదంచేశారు. ఆపై వేదిక మీదున్న గవర్నర్ బిశ్వభూషణ్ హరిచం దన్, సీఎం వైఎస్ జగన్, కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్తదితరులకు అభివాదం తెలిపారు. ‘‘ ఏపీలో కొన్ని నెలల కిందట భీమవరంలో విప్లవవీరుడు అల్లూరి జయంతి వేడుకలో పాల్గొనే అవకాశం వచ్చింది. ఇప్పుడు దేశంలో విశేషమైన అద్భుత నగరం విశాఖలో ఉన్నాను. విశాఖ ఓడరేపు చారిత్రకమైంది. ఇక్కడ నుంచి రోమ్ వరకు వ్యాపారంజరిగేది. ఆరోజు కూడా విశాఖపట్నం ప్రముఖ వ్యాపారం కేంద్రంగా విరజిల్లుతోంది. రక్షణ, వ్యాపార, పారిశ్రామిక రంగాల్లోవిశాఖది కీలకపాత్ర పోషిస్తుంది.అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు దేశంలోనే కాదు.. ప్రపంచవ్యా ప్తంగా ప్రజలకు గుర్తింపు ఉంది. అన్ని రంగాల్లో తమ ప్రత్యేకతను చాటుకుంటున్నా రు. స్వభావ రీత్యా స్నేహపూర్వకంగా ఉంటారు. ప్రతీ రంగంలో మెరుగైన మార్పు కోసం తెలుగుప్రజలు తపన పడతారు. అలాగే సాంకేతిక వైద్య రంగాల్లో ఏపీకి ప్రత్యే క గుర్తిం పు ఉంది. అందుకే ఇవాళ రూ. 10వేల కోట్లప్రాజెక్టులను జాతికి అంకితం చేస్తున్నాం . ఇవాళ ఏపీకి, విశాఖకు గొప్ప దినం. విశాఖ రైల్వే స్టేషన్ను అభివృ ద్ధి పరుస్తూనే.. ఫిషింగ్ హార్బర్ను ఆధునీకరిస్తాం . తీర ప్రాంతం వేగవంతమైన అభివృద్ధిని సాధిస్తుంది. ఓడరేవుల ద్వారా వేల కోట్లలో వ్యాపారం జరుగుతుంది. విశాఖ ఫిఫింగ్ హార్బర్ అభివృద్ధితో మత్స్య కారుల జీవితాల్లోమార్పు వస్తుంది. దేశాభివృద్ధిలో ఏపీ కీలక భూమిక పోషిం చనుంది. ఆంధ్ర ప్రదేశ్ అభివృ ద్ధికి మా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుం ది. అని భరోసా ఇచ్చారు. ఇప్పు డు చాలా దేశాలు వెనుకం జలో ఉన్నా యి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ అభివృద్ధి సాధిస్తోంది అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *