సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం స్థానిక కురుశెట్టి వారి వీధిలో దశాబ్దాలుగా వస్త్ర వ్యాపారంలో సుప్రసిద్దంగా ఉన్న అమ్మ సిల్క్స్ వారి ఆధ్వర్యంలో.. కాస్మో సిటీలకు ఏమాత్రం తీసిపోని రీతిలో.. కేవలం మహిళల కోసం, ఆధునిక డిజెన్స్, డ్రెస్ మెటీరియల్స్ తో ఇటీవల ప్రారంభించిన ఐకాన్ ప్యాషన్ వస్త్ర ప్రపంచం.. కావ్య .. షో రూమ్ ను స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సందర్శించి నిర్వాహకులకు శుభాభినందనలు తెలపడం జరిగింది. ఈ సందర్భముగా కావ్య సంస్థ తరపున మావూరి సుందర రావు స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ కు శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మవారి చిత్ర పటాన్ని జ్ఞాపికగా అందజెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమం లో ఎంపీపీ, పేరిచర్ల నరసింహరాజు, తోట బోగయ్య ,ఏఎంసీ చైర్మెన్ తదితరులు పాల్గొనడం జరిగింది.
