సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం ఉండి రోడ్ లో ఉన్న కోట్ల ఫంక్షన్ హాలులో తెలుగుదేశంపార్టీ అధినేత నారా చంద్రబాబు పిలుపు మేరకు రాష్ట్రంలోని ఆక్వారైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై జగన్ సర్కార్ ఉదాసీన వైఖరి వ్యవహరిస్తుందని, ఆక్వా రైతుల భవిషత్తు ఆందోళనకరం గా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉభయ గోదావరి జిల్లాల తెలుగుదేశం పార్టీ నేతలు ఆధ్వర్యంలో ఆక్వా రైతుల సమస్యలపై “ఆక్వా రైతు పోరుబాట” “అంటూ తెలుగుదేశం పార్టీ భారీ కార్యక్రమం నిర్వహించింది. దీనిలో భీమవరం నుండి టీడీపీ మాజీ రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి స్థానిక నేతలు, ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివ, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తదితరులతో పాటు మాజీ మంత్రులు, టీడీపీ రైతు విభాగం కు చెందిన పలువురు రైతు నేతలు, పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్లు ఆక్వా రైతులు,టీడీపీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం తరువాత ప్లే కార్డులతో మాజీ ఎమ్మెల్యే కలవపూడి శివఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించడానికి టీడీపీ శ్రేణులు ప్రయతించగా పోలీసులు సెక్షన్ 30 అమలు లో ఉందని ర్యాలీ ని అడ్డుకొన్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు నిరసన తెలిపాయి.
