సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం, పట్టణంలోని ఎడ్వర్డ్ ట్యాంక్ వద్ద పురాతన శ్రీ సీతారామ లింగేశ్వర స్వామి ఆలయ పునర్ నిర్మాణానికి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగారు. ఈ ఆలయ పునర్నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా రూ కోటి నిధులను మంజూరు చేయించారు. అయితే భక్తుల నుండి 33 లక్షల 33 వేల రూపాయల వరకు కాంట్రిబ్యూషన్ ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండడంతో, ఈ నిధులను కూడా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నేటి, సోమవారం స్వయంగా పలువురు భక్తులకు,ఆధ్యాత్మిక దాతలకు ఫోన్ చేసి సేకరించారు. దానితో దాతల నుండి 23 లక్షల వరకు నిధులు రావడంతో, తమ గ్రంధి కుటుంబం వంతుగా మిగిలిన 10 లక్షల 33 వేల రూపాయలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆలయ పున నిర్మాణానికి విరాళంగా ప్రకటించారు.
