సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధన హాస్పటల్స్ లో 1,458 సీనియర్ రెసిడెం ట్ (ఎస్ఆర్) డాక్టర్ల నియామకానికి డైరెక్టర్ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎం ఈ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈనెల 19వ తేదీ రాత్రి 12 గం టల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 45 ఏళ్ల లోపు వయస్సు వారు , ప్రభుత్వ మెడికల్, డెంటల్ కళాశాలల్లోపీజీ పూర్తి చేసిన వైద్యులు దరఖాస్తు చేసుకునేం దుకు అర్హులు. http://dme.ap.nic.in (http://dme.ap.nic.in) వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఓసీ అభ్య ర్థులు రూ.500, ఎస్సీ , ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూ ఎస్ అభ్య ర్థులు రూ.250 చొప్పు న దరఖాస్తు రుసుం చెల్లించాలి.ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్ఆర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్కు రూ.85 వేలు, స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ)కు రూ.65 వేలు చొప్పున గౌరవ వేతనాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ఉద్యొగాలులో అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్లో 144, జనరల్ మెడిసిన్లో 101, జనరల్ సర్జరీ విభాగం లో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్ లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో1,458 ఎస్ఆర్ పోస్టులు భర్తీ కానున్నాయి.
