సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో సినిమా టికెట్ల ధరలపై ఏపీ హైకోర్టులో నేడు, గురువారం విచారణ జరిగింది. ఇటీవల సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌కు వెళ్లింది. తాజా వార్త సమాచారం మేరకు జీవో 35ను సస్పెండ్ చేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై ప్రభుత్వం స్టే కోరింది. సింగిల్ జడ్జి ఆదేశాల మేరకు థియేటర్ యజమానులు టికెట్ ధరల ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్ ముందు ఉంచాలని న్యాయస్థానం ఆదేశించింది. టికెట్ ధరలపై జేసీ నిర్ణయం తీసుకుంటారని హైకోర్టు ధర్మాసనం తెలిపింది.. అనంతరం దీనిపై తదుపరి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది.
