సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: కర్నూలు జిల్లాలో మూడ్రోజుల పర్యటనలో భాగంగా ప్రతిపక్ష నేత చంద్రబాబు రోడ్డు షో లు నిర్వహిస్తున్నారు. టీడీపీ క్యాడర్ మంచి ఉత్సహంగా పనిచేస్తుంది. అయితే పలు చోట్లా వైసిపి నేతలు ‘రాయల సీమా ద్రోహి గో బ్యాక్.. 3 రాజధానులు కావాలి’ అంటూ చంద్రబాబు కాన్వాయ్ ఎదుట నిరసనల ప్రదర్శనలు చెయ్యడం ఉద్రిక్తలు తలెత్తడం జరిగింది. ఇక చంద్రబాబు దేవనకొండ, కోడుమూరు, పత్తికొండ తో పాటు పలు చోట్లా ప్రజల నుద్దేశించి మాట్లాడుతూ.. ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలు నాకు చివరి ఎన్నికలు .. రాష్ట్రాన్ని బాగుచేసే అవకాశం ఇవ్వండి. ‘ఈ ముఖ్యమంత్రికి పాలన చేతకాదు.. నియంతగా మారాడు. దావూద్ ఇబ్రహీంను మించిపోయాడు..’ అని మండిపడ్డారు. జగన్‌కు సవాల్ చేస్తున్నా.. రాయలసీమకు ఒక్క పరిశ్రమైనా తెచ్చావా? టీడీపీ అధికారంలో ఉండగా.. ప్రపంచ దేశాలు తిరిగి రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాం. రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టారు. 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చాయి. రాయలసీమలో నీళ్లు లేని ప్రాంతం అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమను తెచ్చిన ఘనత మాదే. నా వయసైపోయిందని అంటున్నారు. నేను ఫిట్‌గా ఉన్నాను. కర్నూల్ రాజధాని కాకుండా నేను అడ్డుకోలేదు. టీడీపీ కార్యకర్తలపై దాడులు చేస్తే సహించేది లేదు. ’ అని వ్యాఖ్యానిస్తున్నారు.
