సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం పొంచివుందని వార్తలు నిజం చేస్తూ అనేక ప్రఖ్యాత సాఫ్ట్ వేర్ కంపెనీలు వేలాదిగా ఉద్యోగులను తొలగించే కార్యక్రమం ఉపందుకొంది. భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన అమెరికాకు చెందిన మల్టీ నేషనల్ కంపెనీ అమెజాన్ భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైంది. వ్యయ భారాన్ని తగ్గించుకునే వంకతో గత కొన్ని రోజులుగా ఐటీ కంపెనీలు భారీ సంఖ్యలో ఉద్యోగుల తొలగింపునకు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అమెజాన్ కూడా తాజాగా ఏకంగా ప్రపంచవ్యాప్తంగా అమెజాన్లో పనిచేస్తున్న సుమారు 10వేల మంది ఉద్యోగులను తొలగించాలని నిర్ణయానికొచ్చినట్లు ?సమాచారం. నిన్న బుధవారమే ఈ ప్రక్రియ మొదలైనప్పటికీ అమెజాన్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడం గమనార్హం. ఎట్టకేలకు అమెజాన్ తాజాగా ఈ వార్తలను ధ్రువీకరించింది.
