సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: గతంలో ప్రధాని మోడీ ప్రకటించినట్లుగానే దేశంలో ఇకపై అమ్మాయిల వివాహ వయసును కూడా 21 ఏళ్లుగా నిర్ణయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ వయసు 18 సంవత్సరాలుగా ఉంది. అబ్బాయిల వయసు 21 సంవత్సరాలుగా ఉండగా, అమ్మాయిల వయసు 18గా ఉండడం సరికాదని మహిళా సంఘాలు చెబుతున్నాయి. అమ్మాయిల వివాహ వయసు తక్కువగా ఉన్నందున ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, గర్భం దాల్చినప్పుడు పలు ఇబ్బందులు వస్తున్నాయని మహిళా వైద్య పరిశోధకులు కూడా నేపద్యంలో అమ్మాయిల వయసును కూడా ఇరవైఒక్క సంవత్సరాలుగా నిర్ణయిస్తు నేడు, గురువారం కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇటీవల చదువులలో మేటిగా రాణిస్తున్న భారతీయ వనితలు జీవితంలో స్థిరపడటానికి ఈ సడలింపు ప్రయోజనకారిగా ఉండనుంది.
