సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికాలో మంత్రి నారా లోకేష్ కు అక్కడి తెలుగువారు ఘన స్వాగతం పలికారు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో పారిశ్రామికవేత్తలతో నేడు, శనివారం భేటీ అయ్యారు. వారితో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నామని, టెక్నాలజీ రంగంలో నూతన శకం ‘ఆర్టిఫీషియల్ ఇంటెలీజెన్స్’ నవీన పోకడలతో ముందుకు వెళ్తున్నామని మంత్రి లోకేష్ అన్నారు. A I తో ఫ్యూచర్‌లో ఎన్నో అవకాశాలున్నాయని, విప్లవం సృష్టిద్దాం.. పెట్టుబడులతో తరలిరావాలని ఎన్ఆర్ఐలకు పిలుపునిచ్చారు. వై2కే బూమ్ నేపథ్యంలో హైదరాబాద్, బెంగుళూరు నగరాల్లో ఐటీ శరవేగంగా అభివృద్ధి చెందిందని, ప్రస్తుతం ట్రెండింగ్‌లోని ఏఐ అవకాశాలను అందిపుచ్చుకుని ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి సాధించబోతోందని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఏపీలో పరిపాలనలో ఏఐ వినియోగంతో ప్రజలకు వేగవంతమైన, మెరుగైన సేవలను అందించటానికి తాము కృషిచేస్తున్నట్లు తెలిపారు..ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత తొలిసారిగా లోకేష్ అమెరికాలో పర్యటిస్తున్నారు. అక్టోబర్ 25 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు లోకేష్ అమెరికాలో పర్యటించనున్నారు. ఈనెల 29న లాస్ వేగాస్ నగరంలో జరగనున్న ఐటీ సర్వీస్ సినర్జీ’ 9వ సదస్సుకు హాజరు కానున్నారు. 31న అట్లాంటాలో ఎన్టీఆర్ ట్రస్ట్ ఏర్పాటుచేసిన అన్న ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటారు.
