సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశ రాజధాని న్యూఢిల్లీలో‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు‘(India AI Summit) ప్రపంచ దేశాల అధినేతలు, సాంకేతిక సంస్థలు,నిపుణులు సమక్షంలో జరుగుతోంది. నేడు,గురువారం ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ( Modi AI ) మాట్లాడుతూ.. .. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ సమ్మిట్అని పేర్కొన్నారు. ‘ఏఐ సమ్మిట్నిర్వహణ భారత్‌కే కాదు.. దక్షిణాసియాకే గర్వకారణం అవుతుంది. కొత్త సాంకేతికతను భారత్ యువత ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికత అందిపుచ్చుకుంటోంది. ప్రతిభావంతులకు స్వర్గధామంగా భారత్ ఉంది.ఏఐ కేంద్రంగా ఇండియామారుతోంది. ఏఐ అనేది యువత, భారత్‌కు కొత్త విశ్వాసం, ఆస్తిగా ఉంది. తొలినాళ్లలో ఏఐపై అనేక సందేహాలు వచ్చాయి.కృత్రిమ మేధ(ఏఐ) అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి లాంటింది.అందుకే దాన్ని ప్రయోజనకారిగా వినియోగించు కోవాలి. గతంలో అణు పదార్థంతో సంక్షోభాన్ని చూశాము.. అలానే దానివల్ల మంచినీ చూశాం.అదే విధంగా ఏఐతోనూ మంచి చేయడానికి ప్రయత్నించాలి. ఏఐ మనల్ని కాదు.. మనం ఏఐని మానవ ప్రయోజనాలు పరిరక్షించేలా మార్చాలి . అని మోడీ సందేశము ఇచ్చారు.( ఫై చిత్రంలో గూగుల్ సీఈఓ గూగుల్ పిచ్చయ్య తదితరులతో పీఎం మోడీ తాజా చిత్రం చూడవచ్చు)
