సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దొరికితే దొంగలు.. దొరకని అవినీతి తిమింగలాలు ఎన్నో.. నేడు, మంగళవారం ఉదయం పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మున్సిపల్ సర్వేయర్‌గా పనిచేస్తున్న అధికారి, రామకృష్ణ ఇంట్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఒక రైతుకు చెందిన స్థలానికి సంబంధించి సర్వే రిపోర్టు ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతూ పలుసార్లు తెరిపించుకొని రూ.50,000 లంచం డిమాండ్ చేశారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించడంతో, వారు పక్కా ప్లాన్‌తో నేడు . మంగళవారం రామకృష్ణ తన నివాసంలో ఆ నగదును తీసుకుంటుండగా ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు తెలుస్తుంది. అనంతరం రామకృష్ణ నివాసంలో అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది.
