సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశం యావత్తుగా మహాశివరాత్రి రోజు వీక్షించిన పాకిస్థాన్‌పై భారత్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఏసీసీ మహిళల ఆసియా కప్‌ రైజింగ్‌ స్టార్‌2026లో భాగంగా నేడు, ఆదివారం భారత్‌-ఎ, పాకిస్తాన్‌-ఎ జట్లు పోటీపడగా … టీమిండియా బౌలర్లు విజృంభించడంతో 93 పరుగులకే పాక్ కుప్పకూలింది.. అనంతరం భారత జట్టు కేవలం10.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు సత్తాచాటారు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే… బ్యాంకాక్‌లోని టెర్‌థాయ్‌ క్రికెట్‌ మైదానంలో టాస్‌ గెలిచిన పాకిస్థాన్‌ జట్టు తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే,. ఓపెనర్లలో యుస్రా ఆమిర్‌ (1)ను సైమా ఠాకూర్‌ అవుట్‌ చేయగా.. వన్‌డౌన్‌ బ్యాటర్‌ ఒమైమా సొహైల్‌ (1)ను జింతిమణి కలిత, కెప్టెన్‌ హఫ్సా ఖలీద్‌ (1)ను ఐమా, హురైనా సజ్జద్‌ (2)ను కెప్టెన్‌ రాధా యాదవ్‌ పెవిలియన్‌కు పంపించారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన రాధా యాదవ్ సేన కేవలం 10.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *