సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం మార్కెట్ యార్డ్ నూతన చైర్మెన్ , డైరెక్టర్స్ పదవి స్వీకారోత్సవం నేడు, గురువారం సాయంత్రం స్థానిక అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఘనంగా నిర్వహించారు. వేదికపై స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కోటిపల్లి నాగమల్లేశ్వర రావు చైర్మెన్ గాను ఇతర నూతన డైరెక్టర్స్ తమ పదవి ప్రమాణాలు చేసారు. ఈ సందర్భముగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ నూతన కమిటీ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ రైతుల పట్ల సీఎం జగన్ కున్న గౌరవం ప్రతిబింబించేలా వారికీ అన్ని ప్రభుత్వ సంక్షేమాలు అందేలా కృషి చెయ్యాలని హితవు పలికారు. ఈ సందర్భముగా ఆయన సభలో విశేషంగా హాజరు అయిన వైసిపి నేతలనుద్దేశించి మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ ఫై గెలిచిన తనకు మంత్రి పదవి ఇవ్వలేదని తాను సీఎం జగన్ ఫై అసంతృప్తి తో ఉన్నట్లు ఇటీవల జరుగుతున్నా ప్రచారాన్ని ఖండించారు. పవన్ కళ్యాణ్ ను తాను భీమవరంలో ఓడించడంలో కసిగా పనిచేసిన స్థానిక వైసిపి నేతల కృషి కి సీఎం జగన్ ఎంతో గొప్పగా పట్టం కట్టారని, కొయ్య మోషేను రాజు కు ఎమ్మెల్సీ పదవి తో పాటు శాసనమండలి చైర్మెన్ చేసారని, శ్రీనివాస్ ను జడ్పీ చైర్మెన్ ను చేసారని, వేండ్ర వెంకట స్వామి, గూడూరి ఉమాబాల, మేడిది జాన్సన్ వంటి వారికీ ఎన్నో కీలకమైన పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చి గుర్తింపు గౌరవం ఇచ్చారని అందరిని గౌరవించిన గొప్ప నాయకుడు సీఎం జగన్ అని ప్రశంసించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *