సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మరియు శాసనమండలి సమావేశాలు నేడు, గురువారం ఉదయం ప్రారంభం అయ్యాయి.. ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఏపీ మండలి చైర్మెన్, కొయ్య మోషేను రాజు తమ సభలలో ప్రశ్నోత్తరాలను చేపట్టారు. రాష్ట్రంలో యూరియా దొరక్క రైతులు పడుతున్న ఇబ్బందులపై చర్చించాలని మండలిలో వైసీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. అయితే.. అసెంబ్లీ సమావేశాలను 5 రోజుల పాటు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉంది. బీఏసీ సమావేశంలో అసెంబ్లీ పనిదినాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఆరు ఆర్డినెన్సుల స్థానంలో బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.ఈ క్రమంలో.. వైసీపీ ఎమ్మెల్యేలంతా అసెంబ్లీకి రావాలని స్పీకర్ అయ్యన్నపాత్రుడు పేర్కొన్నారు. సభాపతి స్థానానికి గౌరవమివ్వాల్సిన అవసరం ఉందని..వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా ఉండడం సరికాదంటూ పేర్కొన్నారు.
