సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ అసెంబ్లీ సమావేశాలు నేటి సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. నేడు, సోమవారం ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు. ఆయనకు ఇరువైపులా ఉభయ సభల స్పీకర్లు.. శాసనమండలి చైర్మెన్ , కొయ్యే మోషేనురాజు మరియు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అస్సినులయ్యారు. క్రింద సభ్యుల సీట్లలో సీఎం చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్ తదితర ఎమ్మెల్యే లు ఎమ్మెల్సీలు హాజరు అయ్యారు. గవర్నర్ ప్రసంగంలో చంద్రబాబు హయాంలోనే 2014 నుండి 19వరకు ఏపీలో అభివృద్ధి జరిగినదని తరువాత రాష్ట్రము తిరోగమనమే నని ఇప్పుడు మరల ఎన్డీయే ప్రభుత్వం లో అభివృద్ధి పధంలో కొనసాగుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు. గవర్నర్ ప్రసంగం ఆసాంతం సభలో పెద్ద సంఖ్యలో ఉన్న వైసీపీ 30 మంది పైగా ఎమ్మెల్సీ లు 11 మంది ఎమ్మెల్యేలు ‘సేవ్ ఆంధ్ర ప్రదేశ్’ అరాచకం.. దాడులు ఆగాలి అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు. . అనంతరం స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు నేతృత్వంలో శాసనసభ వ్యవహారాల కమిటీ సమావేశం అయ్యింది. అసెంబ్లీ ఎజెండా, పని దినాలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కార్యక్రమానికి వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాలేదు.
