సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఏపీలో తమ సమస్యల పరిష్కారం కోసం బాగా పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆందోళనలు, కనీసం 2 డి ఏ లు విడుదల చెయ్యాలని పిలుపునిస్తూ సమ్మెల పిలుపుల నేపథ్యంలో ఇటీవల వారితో చర్చలు జరిపిన ప్రభుత్వం దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు (AP Govt Employees) పెన్షనర్లకు ప్రభుత్వ ఉద్యోగులకు ఒక డీఏను విడుదల చేస్తూ నేడు, సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. 2024 జనవరి 1 నుంచి డీఏను 3.64 శాతం పెంచుతూ ఆదేశాలు ఇచ్చింది. డీఏ పెంపు 2024 జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.పెన్షనర్లు/ కుటుంబ పెన్షనర్లకు చెల్లించాల్సిన డియర్నెస్ రిలీఫ్ (DR) 3.64% పెంచింది ప్రభుత్వం. 2024 జనవరి 1 నుంచి అమలులోకి రానున్న 3.64 శాతం డీఆర్ పెంపుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కొత్త డీఏతో పాటు బకాయిలు కూడా త్వరలోనే విడుదల కు ఏర్పాటు చేస్తామని తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *