సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులకు, ప్రభుత్వ వైద్యశాలల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఇప్పటికే పేస్ యాప్ (ముఖ హాజరు) అమలు జరుగుతున్న తరుణంలో రాష్ట్ర వ్యాప్తంగా నేటి గురువారం నుండి పలు ఇంజనీరింగ్, డిగ్రీ, బీఈడీ, ఫార్మసీ విద్యార్థులకు పేస్ యాప్ హాజరు మొదలు పెట్టారు. మొదటి రోజు కావడంతో ఆయా కశాళాలల్లో బోధించే అధ్యాపకులే తమ సెల్‌ఫోన్‌లోని యాప్ ద్వారా విద్యార్థుల నుంచి ముఖ హాజరు తీసుకొంటున్నారు. దీనికి కొంత అదనపు సమయం పడుతుంది. అయితే . విద్యార్థుల వివరాలను జ్ఞానభూమి పోర్టల్‌లో ఇప్పటికే రిజిష్ర్టేషన్ ప్రక్రియ పూర్తిచేశారు. ఉదయం క్లాస్‌కు వెళ్లిన వెంటనే ముఖ హాజరు వేయాలి. ప్రతిరోజు ఐదు పిరియడ్స్‌కు ముఖ హాజరు వేయాలని ప్రభుత్వం నిబంధనలు పెట్టింది. విద్యార్థులకు 75 శాతం హాజరు ఉంటేనే విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలను అందజేస్తారు మరి..
