సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అంగన్వాడీ సూపర్ వైజర్ పోస్టుల భర్తీకి హైకోర్టు నేడు, బుధవారం పచ్చజెండా ఊపింది. తాము ఎంపిక అయినప్పటికీ, మెరిట్ లిస్ట్ లో పేర్లు ఉన్నప్పటికీ ప్రక్రియను నిలిపివేశారని మెరిట్ అభ్యర్ధులు హైకోర్టును ఆశ్రయించారు. మెరిట్అభ్యర్ధుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్ కోర్టులో వాదనలు వినిపించారు. విచారణ జరిపిన ధర్మాసనం… గతంలో జరిగిన ఎంపిక ప్రక్రియ ద్వారా ఎంపికైన అభ్యర్ధుల జాబితాకు లైన్ క్లియర్ చేసింది. కాగా… అంగన్వాడీ సూపర్ వైజర్ల పోస్టుల ఎంపికలో తమకు అన్యాయం జరిగిందని మరికొంతమంది అభ్యర్ధులు కోర్టును ఆశ్రయించారు. అయితే వారి పిటిషన్‌లను కొట్టివేస్తూ పాత ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనేని రామకృష్ణ ప్రసాద్ స్పష్టం చేశారు.
