సిగ్మాతెలుగు డాట్, ఇన్, న్యూస్: గత ఏడాది కరోనా మహమ్మారి ఆంక్షలతో కాస్త దూకుడు తగ్గిన సంక్రాంతి ఈసారి మాత్రం.. ప్రక్క తెలుగు రాష్ట్రము తెలంగాణ నుండి వచ్చిన లక్షలాది అతిధులు తో కలసి ఆంధ్ర ప్రదేశ్ లో అన్ని జిల్లాలో దుమ్ము దులిపేసింది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో ఆనందాలు , వినోదాలు అంబరాన్ని అంటాయి. సంక్రాంతి పండుగలో అగ్రగామి అయిన భీమవరంలో నేడు, సోమవారం కూడా ముక్కనుమ పండుగ అయ్యినప్పటికీ నిన్న ఆదివారం రావడంతో నిన్న రాత్రికే అతిధులు తిరుగు ప్రయాణాలు ప్రారంభ మయ్యాయి. నేడు, సోమవారం పండుగ దూకుడు నెమ్మదించింది,బంధుమిత్రుల కు విడ్కోలులతో పరిమితం అయ్యింది. అన్ని వ్యాపారాలు బాగా జరిగాయి.స్టాఫ్ కు విశ్రాంతి నిమిత్తం పట్టణంలో చాల దుకాణాలు తెరవలేదు. గత 3 రోజులు సంక్రాంతి ఒక రెంజ్ లో జరిగింది. ఏ వీధి చూసినా రంగులద్దిన రంగవల్లులు.. వాటిపై గొబ్బెమ్మలు.. ప్రతి ఇంటి నుంచి కమ్మటి పిండివంటల వాసనలు.. యువతీయువకుల జోష్ .. తెలుగు పురాతన సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేస్తూ .. కోడిపందేలు, అది కూడా పలు చోట్ల కేవలం మహిళల కోసం ప్రత్యేక పందాలు నిర్వహించడం విశేషం.. కాళ్ల మండలం సీసలిలో నిర్వాహకులు రెండు బుల్లెట్లు బహుమతులుగా ఇవ్వడం మరో విశేషం.. . ఇక గోపూజలు,. గాలిపటాలు.. కబ్బడి క్రీడాపోటీలు.. ముగ్గుల పోటీలు.. ఈ మూడురోజులు కనిపించిన దృశ్యాలివి. భోగి రోజైన శుక్రవారం మొదలైన కోడి పందాల జాతర కనుమ రోజైన ఆదివారం సా.6 గంటలతో ముగించారు. . బరుల వద్ద శాంతి భద్రతల కోసం ఏకంగా బౌన్సర్లను రంగంలోకి దించారు. ఇతర జూదాలను మాత్రం అదుపులో పెట్టడంలో పోలీసులు పాత్ర అభినందనీయం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *