సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల వరుసగా కందుకూరు, గుంటూరు పశ్చిమాలలో చంద్రబాబు సభలలో జరిగిన దుర్ఘటనలు 11 మంది మృతి, అనేకమందికి గాయాలు ,, ఘటనలు దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై రోడ్ షో సభలు, ర్యాలీలను నియంత్రించాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర హోం శాఖ మార్గదర్శకాలు జారీచేసింది. మున్సిపల్, పంచాయతీ రహదారులు, ప్రధాన సెంటర్స్ రోడ్డు మార్జిన్ల వద్ద ఇకపై రోడ్డు షో బహిరంగ సభలకు అనుమతి లేదు. పోలీసు నిబంధనలను అమలు చేయనున్నారు. రోడ్డుకు దూరంగా, ట్రాఫిక్ కు ప్రజలకు ఇబ్బందిలేని విధంగా సభలు, రోడ్డు షోలు నిర్వహించేం దుకు ప్రత్యామ్నాయ ప్రదేశాలను ఎంపిక చేయాలని అధికారులకు హోం శాఖ సూచించింది. ఎంపిక చేసిన ప్రదేశాల్లోనే సభలు, ర్యాలీలు జరిగేలా చూడాలని స్ప ష్టం చేసింది. అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో షరతులతో కూడిన అనుమతివ్వనున్నట్లు ప్రకటించింది. పరోక్షంగా చంద్రబాబు రోడ్లపై ఇదేం ఖర్మ..సభలకు పవన్ కళ్యాణ్ వారాహి రోడ్డు షోలకు చెక్ పడినట్లే..
