సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో దేవదాయశాఖలో గ్రేడ్-3 ఈవో పోస్టులకు మెయిన్స్ పరీక్షను ఫిబ్రవరి 17న నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షకు 1,278 మంది అర్హత సాధించారని, వీరికి విశాఖపట్నం, కృష్ణా, చిత్తూరు, కర్నూలు నాలుగు జిల్లాల్లో ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9.30 నుంచి 12గంటల వరకు పేపర్-1 జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ.. మధ్యాహ్నం 2.30 నుంచి 5గంటల వరకు పేపర్-2 హిందూ ఫిలాసఫీ, టెంపుల్ సిస్టం అంశాలపై పరీక్షలు జరుగుతాయని ప్రకటించారు.
