సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై వచ్చే నవంబర్ 1 వ తేదీ నుండి ప్లాస్టిక్ ఫ్లెక్సీల పై నిషేధం అమలులోకి వస్తుందని ఆదేశాలు వెలువడ్డాయి. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ప్లెక్సీ వ్యాపారులు , పనివారు తమ ఉపాధి కాపాడాలని ఒక రోజు బంద్ కూడా చేసినప్పటికీ ..ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ..ఏపీ ప్రభుత్వం నిషేధం ఫై తాజగా నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబర్ 1 నుంచి ఈ నిషేధం అమల్లోకి దృష్ట్యా ప్లాస్టిక్ ఫ్లెక్సీలో ఉత్పత్తి, దిగుమతిగా అనుమతి లేదని తెలిపింది. ప్లాస్టిక్ ఫ్లెక్సీలు వినియోగం, ముద్రణ, రవాణా ప్రదర్శనపైన నిషేధం విధించింది. ఈ నిషేధం అమలులో నగరాలు, పట్టణాలు అధికారులు బాధ్యత వహించాలని ఆదేశించింది.నిషేధం అమలును పోలీస్, రవాణా, జీఎస్టీ అధికారులు పర్యవేక్షించాలని తెలిపింది. ప్లాస్టిక్ కు బదులుగా కాటన్, నేత వస్త్రాలు వాడాలంటూ ఉత్తర్వులు పేర్కొంది.గ్రామాల్లో ఫ్లెక్సీలు వాడకుండా చూడాల్సిన బాధ్యత కలెక్టర్లదేనని స్పష్టం చేసింది. నిబంధనలు అతిక్రమిస్తే ఫ్లెక్సీకి రూ.100 చొప్పున జరిమానా విధిస్తామని హెచ్చరించింది. ఉత్తర్వులు అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జీవో జారీ చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *