సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అనుకున్న దానికన్నా 3 రోజుల ముందే ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో నైరుతి రుతుపవనాలు ప్రవేశించాయి. రానున్న మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాలు విస్తరించనున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటి నుండి గోదావరి జిల్లాలలో ముఖ్యంగా కోనసీమలో భారీ వర్షాలు పడుతున్నాయి. మిగతా ప్రాంతాలలో, భీమవరం పరిసర ప్రాంతాలలో ఉరుములతో చెదురుమదురు వర్షాలు పడుతున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాలలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. పొడి వాతావరణం ఉన్నచోట మాత్రం కొంత ఉక్కపోత ఉండే అవకాశం ఉందన్నారు. ఈ ఏడాది ఈ సీజన్ లో ఎక్కువ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం గమనార్హం.
