సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లోని మెడికల్ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్లు పెరిగాయని ఏపీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా..106 సీట్ల భర్తీకి జాతీయ వైద్య కమిషన్(ఎన్ఎంసీ) ఆమోదం తెలిపిందని ప్రకటించారు. అలానే (గత జగన్ ప్రభుత్వ హయాంలో పూర్తీ చేసిన 7 మెడికల్ కాలేజీల్లో.. )కొత్తగా అడ్మిషన్లు చేపట్టిన 5 కాలేజీల్లో కూడా 60 సీట్లు వచ్చాయని తెలిపారు. దీని వల్ల మరింత మంది విద్యార్థులు పీజీ పూర్తి చేయడానికి అవకాశం లభించినట్లు అవుతుంది. ఏపీలో చంద్రబాబు సర్కార్ ఒక ప్రక్క మెడికల్ కాలేజీల పరోక్షంగా ప్రైవేటీకరణ చెయ్యాలని పీపీపీ విధానం ప్రెవేశపెటిందని ప్రతిపక్ష విమర్శలు ఎదుర్కొంటుంటే…. మరో ప్రక్క కేంద్రంలోని మోడీ సర్కార్ ఆంధ్ర ప్రదేశ్ లోని మెడికల్ పీజీ సీట్లు పెంచుతూ తాజా నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. ఇదే రీతిలో వైసీపీ ఎంపీ మిదున్ రెడ్డి ని లిక్కర్ కేసులో నిందితుగా రాష్ట్ర ప్రభుత్వం కేసు పెడితే కేంద్రం ఆయనను అమెరికాలోని ఐక్యరాజ్య సమితి కి భారత్ తరుపున గళం విప్పడానికి పంపించడం, ప్రధాని మోడీ ఏపీలో ఎప్పుడు పర్యటించిన వైసీపీ అధినేత జగన్ గురించి ఒక్క విమర్శా మాట కూడా మాట్లాడకపోవడం అనేక సందేహాలకు స్వతంత్ర స్టాటజీ కి తావిస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *