సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈసారి ఆంధ్ర ప్రదేశ్ లో వచ్చే ఫిబ్రవరిలోనే ఇంటర్ పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని ఇప్పటికే ఇంటర్‌ బోర్డు వెల్లడించిన సంగతి తెలిసిందే. (గతంలో మార్చిలో మాత్రమే ఇంటర్ పరీక్షలు జరిగేవి). ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ బోర్డు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్‌ ఫస్ట్‌, సెకండ్‌ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల ఫీజు తేదీలను విడుదల చేసింది. రెగ్యులర్ విద్యార్థులు, ఫెయిల్ అయిన విద్యార్థులు(జనరల్, వొకేషనల్), కాలేజీలో చదవకుండా ప్రైవేట్‌గా హ్యూమానిటీస్ గ్రూప్‌లో పరీక్షకు సిద్ధం అవుతున్న విద్యార్ధులు అందరూ వారు చదువుతున్న కాలేజీల్లోనే సెప్టెంబరు 15 నుంచి పరీక్ష ఫీజు చెల్లించవచ్చని బోర్డు తెలిపింది. అక్టోబర్‌ 10వ తేదీ వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా పరీక్ష ఫీజును చెల్లించాలని బోర్డు వెల్లడించింది. . రూ.1000 ఆలస్య రుసుముతో అక్టోబర్‌ 11 నుంచి 21 వరకు అవకాశం ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *