సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఏపీ ప్రభుత్వం మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు నేడు, మంగళవారం శుభవార్త ప్రకటించింది.. చైల్డ్ కేర్ లీవ్ (CCL) వినియోగంపై పిల్లల వయో పరిమితిని పూర్తిగా తొలగిస్తూ ఆర్థిక శాఖ జీవో ఎంఎస్ నం.70 జారీ చేసింది. గతంలో పిల్లల వయసు 18 ఏళ్లు (దివ్యాంగులకు 22 ఏళ్లు) దాటితే ఈ సదుపాయం లభ్యం కాదు. అయితే ఇకపై మహిళా ఉద్యోగులు, ఇంకా, ఒంటరి పురుష ఉద్యోగులు మొత్తం 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్‌ను తమ ఉద్యోగ విరమణ వరకు ఎప్పుడైనా ఉపయోగించుకొనే అవకాశం కల్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *