సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నిరుద్యగులకు శుభవార్త!ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ (DSC Notification) మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేయనుంది. ఇప్పటికే నవంబరు 6వ తేదీన ఉద్యోగ ప్రకటన చేయనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. ఈ డీఎస్సీ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం పోస్టుల్లో సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్‌ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) పోస్టులు 7725, ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్ (టీజీటీ) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్ (పీజీటీ) పోస్టులు 286, ప్రిన్సిపల్‌ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (పీఈటీ) 132 వరకు ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *