సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నేటి సోమవారం నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం అయ్యాయి. ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం విద్యార్థులు 6,49,884 హాజరు కావలసి ఉంది. వారిలో బాలురు 3,36,225 కాగా, బాలికలు 3,13,659 ఉన్నారు. మొత్తం పరీక్షా కేంద్రాలు 3,450 ఏర్పాటు చేసారు. 156 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు పర్యవేక్షించనున్నాయి. రాష్ట్రంలో 163 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించారు. విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. చీఫ్ సూపరింటెండెంట్‌కు మాత్రమే పరీక్ష కేంద్రంలోకి మొబైల్ తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేసారు. పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రభుత్వం ఉచిత RTC బస్సు సౌకర్యం కల్పించింది. విద్యార్థులు తమ హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రాలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా చేరుకోవాని సూచించింది.ఈ ఏడాది టెన్త్ విద్యార్థులకు ఎన్‌సీ ఈఆర్‌టీ సిలబస్ అమలు చేశారు. వీరితో పాటు ఓపెన్ స్కూల్ సొసైటీ విద్యార్థులకూ ఈ రోజు నుంచే పరీక్షలు జరగనున్నాయి.
