సిగ్మా తెలుగు డాట్ ఇన్, న్యూస్: నేడు, బుధవారం ఉదయం8 గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు నరసాపురం ఎంపీ రఘురామా కృష్ణంరాజు, ఢిల్లీలోని తన నివాసం లో ఏపీ లో ఉద్యొగ సంఘాలు డిమాండ్ చేస్తున్న పీఆర్సీకి ,ఐ ఆర్ అంశాలకు మద్దతుగా ఒక పూట నిరాహార దీక్షలో పాల్గొన్నారు. మరియు ఆంధ్ర ప్రదేశ్ సీఐడీ చీఫ్, పీవీ సునీల్ కుమార్‌పై కేంద్రహోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు లేఖ రాశారు. గతంలో పీవీ సునీల్ కుమార్‌పై వరకట్నం వేధింపుల కింద తెలంగాణలో కేసు నమోదు అయిందని లేఖలో పేర్కొన్నారు.ఆయన భార్య పిర్యాదు మేరకు సునీల్‌పై తెలంగాణలో ఛార్జ్ షీట్ నమోదు చేశారని చెప్పారు. తాను పార్లమెంట్ సభ్యుడి హోదాలో రాష్ట్రంలో శాంతిభద్రతల దృష్ట్యా … వరుస ఘటనలపై విచారణ జరిపి పీవీ సునీల్ కుమార్‌పై చర్యలు తీసుకోవాలని, సాక్షులను ప్రభావితం చేస్తున్నారని, వారిపై ఒత్తిడి తెస్తున్నారని ఆరోపిస్తూ లేఖ రాశారు. ఆరోపణలు, నైతికత దుష్ట్యా పీవీ సునిల్ తక్షణమే సీఐడీ చీఫ్ పోస్ట్ నుంచి బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణం రాజు లేఖలో పేర్కొన్నారు.
