సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాత్కాలిక ఇంచార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు నేడు, సోమవారం స్వీకరించారు. అధికార వైసీపీకి అనుకూలంగా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేస్తున్నారని ఇటీవల పిర్యాదులు రావడంతో ఆయన్ను పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. డీజీపీ పదవి కోసం అధికారుల పేర్లను పంపించాలని కోరింది. దాంతో రాష్ట్ర ప్రభుత్వం ద్వారకా తిరుమల రావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్త అనే ముగ్గురు సీనియర్ ఐపీఎస్ పేర్లను పంపించినట్టు వార్త సమాచారం. కొత్త డీజీపీ ఎవరనే అంశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డికి ఒకటి రెండు రోజులలో ఎన్నికల సంఘం సమాచారం ఇచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు రాష్ట్రంలో ఇంచార్జీ డీజీపీగా శంఖ్రత బాగ్చీ పదవిలో ఉంటారు. శంఖబ్రత గతంలో కర్నూలు జిల్లా ఎస్పీగా పనిచేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *