సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా వెలువడిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాలుగు రోజుల పాటు ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 26 నుంచి 30 వరకు సింగపూర్ పర్యటనకు వెళ్లనున్నారు.ఆయనతో పాటు మంత్రులు నారా లోకేష్, నారాయణ, టీజీ భరత్ కూడా సింగపూర్ పర్యటనలో పాల్గొనే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో పరిపాలనా వ్యవహారాలు సజావుగా సాగేందుకు ఈ 4 రోజులు చంద్రబాబు స్థానంలో ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు ఇన్‌ఛార్జ్ సీఎంగా బాధ్యతలు అప్పగించారు.అయితే అధికారికంగా ప్రకటించలేదు. పవన్ కళ్యాణ్ ఇన్‌ఛార్జ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారనే వార్తలు జనసేన పార్టీ శ్రేణుల్లో మంచి జోష్ నింపాయి. up file photo.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *