సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు నిర్వహిస్తున్న ఏపీ ఈఏపీసెట్ పరీక్షల హల్ టికెట్స్ నేడు, మంగళవారం ఉదయం విడుదలయ్యాయి. ఏపీఈఏపీసెట్-2023 వెబ్ సైట్ లో అధికారులు వీటిని విద్యార్థులకు అందుబాటులో పెట్టారు సైట్ వివరాలు: (https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_GetPrintHallticket.aspx)ఈఏపీసెట్కు రాష్ట్రవ్యా ప్తం గా మొత్తం 3,37,422 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు ఈ నెల 15 నుంచి 19 వరకు జరుగుతాయని, అగ్రికల్చ ర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 22, 23 తేదీల్లో నిర్వహిస్తారు. వివరాలకు 08554-23411, 232248 ఫోను నంబర్ల కు ఫోన్ చేసి సహాయ కేంద్రాన్ని సంప్రదించాలి.
