సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: స్కిల్ స్కాం కేసులో టిడిపి అధినేత చంద్రబాబు ను రాజమండ్రి సెం ట్రల్ జైలులో కస్టడీలోకి తీసుకోని నేడు, శనివారం ఏపీ సీఐడీ అధికారులు స్కాం జరిగిన తీరుపై విచారణ చేపట్టిన నేపథ్యంలో నేడు శనివారం మరో ఆసక్తి పరిణామం జరిగింది. సీఐడీ ఆధారాలు పరిశీలించి చంద్రబాబును జైలు రిమాండ్ కు పంపిన ఏసీబీ కోర్ట్, అడిషనల్ సెషన్స్ జడ్జి, హిమబిందు ( భీమవరంకు చెందిన ప్రసిద్ధ న్యాయవాద కుటుంబం. నిజాయితీ పరురాలుగా పేరున్న పేరున్న ఆమె గతంలో కూడా సంచలన తీర్పులు ఇచ్చిన రికార్డు ఉంది.) ఫై సోషల్ మీడియాలో కొందరు ఆమె ప్రతిష్టకు భంగం కలిగే విధంగా అనుచిత పోస్టులు పెట్టి ఆమెను అవమానిస్తున్నారని భీమవరం కు చెందిన అడ్వకేట్ రామానుజరావు ఈ-మెయిల్ ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కు ఫిర్యాదు చేశారు. దీనితో రాష్ట్రపతి భవన్ స్వాందించింది ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి నేడు, శనివారం రాష్ట్రపతి భవన్ కార్యదర్శి పీసీ మీనా. లేఖ రాశారు. దానిలో జడ్జి, హిమబిందు ని కించపరిచే పోస్టింగులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అలాగే ఆ పోస్టులు పెట్టిన వారిపై తీసుకున్న చర్యల గురించి ఫిర్యాదు దారుడికి వివరించాలని ఆదేశాలు వచ్చాయి.
