సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన నేడు, గురువారం (జులై24) ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం (AP Cabinet ) జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో మొత్తం రూ.70 వేల కోట్లు పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటన్నింటినీ గ్రౌండ్ చేయించిన పక్షంలో, లక్ష మందికి ఉద్యోగాలు వస్తాయని సీఎం చంద్రబాబు తెలిపారు. ఐటీ, ఎలక్ట్రానిక్, డ్రోన్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఈ పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు.విజయవాడ వైజాగ్ లలో మెట్రో రైళ్లు ఏర్పాటుకు టెండర్లు పిలవాలని కాబినెట్ నిర్ణయించింది. త్వరలో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు ఇచ్చే కార్యక్రమం వెంటనే చేపట్టాలని మంత్రులకు సూచించారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయినప్పుడు మన ప్రభుత్వ చొరవతో అమరావతి రాజధాని నిర్మాణానికి,సింగపూర్ ప్రభుత్వం ముందుకు వచ్చి మనకు సహాయం చేసిందని అన్నారు. అయితే తరువాత వారిపై జగన్ ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియం నిర్వాహకులపై అవినీతి చేస్తున్నారని కేసు పెట్టేందుకు కూడా ప్రయత్నం చేశారని.. దీంతో వాళ్లు పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేశారని అన్నారు. వాళ్లతో మళ్లీ మన సంబంధాలను పునరుద్ధరించుకోవాలని సూచించారు.తిరుపతి తొక్కిసలాటలో 7 గురు మృతి చెందటం పై జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఇచ్చిన కమిషన్ నివేదికపై కేబినెట్ లో చర్చించారు. గోవులు చనిపోవడంతో అక్కడి గో సంరక్షణ అధికారి, మరో డీఎస్పీపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కేబినెట్ ఆదేశించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *