సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి పరిపాలన రాజధానిగా విశాఖపట్నం మరో 2 నెలల్లో ప్రారంభం అవుతుందని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ నేడు, శనివారం కీలక వ్యా ఖ్యలు చేశారు. విశాఖలో రెండో రోజుల ‘ఇన్ఫినిటి వైజాగ్’ సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్వరలో ప్రఖ్యాత ఇన్ఫోసిస్ కేంద్రాన్ని వైజాగ్ లో ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ‘‘దేశంలోని ధనిక నగరాల్లోవిశాఖ తొమ్మిదవ స్థానంలో ఉంది. త్వరలో అదాని డేటా సెంటర్ను ప్రారంభిస్తాం. విశాఖను ఐటీ హబ్ చేయడమే మా లక్ష్యం ’’ అని ఆయన ప్రకటించారు. మరో రెండు నెలల్లో విశాఖ ఏపీకి పరిపాలన రాజధాని కాబోతోందని, మరోసారి ఉద్ఘాటించారు. ఈ సదస్సు లో మంత్రి అమర్నాథ్ తో పాటు పలువురు ఐటీ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *