సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: జనసేన పార్టీ రాష్ట్ర నేత, భీమవరం పట్టణ నికి చెందిన వేగేశ్న సూర్యనారాయణరాజు (కనకరాజు సూరి) నేడు శుక్రవారం విజయవాడలో మిగతా డైరెక్టర్స్ తో కలసి ప్రతిష్టాకర ఆంధ్రప్రదేశ్ క్షత్రియ సంక్షేమ, అభివృద్ధి సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకారం చేసారు. ఈ సందర్భముగా కనకరాజు సూరి మాట్లాడుతూ… తాను చైర్మెన్ గా రాష్ట్రంలోని క్షత్రియులకు అన్ని విధాలుగా అండదండగా ఉంటానని. తనకు అవకాశం కల్పించిన ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్‌లకు కృతజ్థతలు తెలిపారు. క్షత్రియుడు అంటే త్యాగానికి, సేవాగుణానికి, ధర్మానికి ప్రతీక అన్నారు. అటువంటి క్షత్రియుల్లో పేద వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం క్షత్రియ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందన్నారు. క్షత్రియులను అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు నడిపేలా పాటుపడతామన్నారు. క్షత్రియు యువతను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు తమవంతు కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం నుంచి క్షత్రియ కార్పొరేషన్‌కు తగినన్ని నిదులు కేటాయించేలా చేసి వాటితో అనేక మంచి కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ వేగేశ్న కనకరాజుసూరి తోపాటు డైరెక్టర్లుగా పేరిచర్ల సుభాష్(నరసాపురం లోక్‌సభ నియోజకవర్గం), అద్దేపల్లి ప్రతాప్‌రాజు(రాజంపేట), భూపతిరాజు శ్రీకృష్ణవర్మ(ఉండి), చేకూరి వెంకటరామరాజు(నిడదవోలు), జయప్రకాష్ నారాయణరాజు దంతులూరి(విజయవాడ సెంట్రల్), మంతెన సత్యనారాయణరాజు (రాజమండ్రి సిటీ), పొత్తూరి కృష్ణంరాజు(ఉంగుటూరు), రామకృష్ణంరాజు యండుకూరి(ఉంగుటూరు), రామచంద్రరాజు నంబూరి(చింతలపూడి), సత్యనారాయణరాజు దెందుకూరి(అమలాపురం), వెంకట సత్యనారాయణ రాజు(గన్నవరం), యరకరాజు సత్యహరిహర రాజు(భీమవరం)లు పదవీ ప్రమాణస్వీకారం చేశారు.
