సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం డ్వాక్రా మహిళల సంక్షేమం కోసం 2 కొత్త పధకాలు ‘ఎన్టీఆర్‌ విద్యాలక్ష్మి’, ‘ఎన్టీఆర్‌ కల్యాణలక్ష్మి’ ఈ దసరా పండుగకు ప్రారంభించవలసి ఉండగా స్వల్ప వాయిదా పడ్డాయ్. ఈ పథకాలను వచ్చే దీపావళి నుండి ప్రవేశపెట్టడానికి సిద్ధం చేస్తున్నారు. ఏపీలో పేద పిల్లల చదువులు, ఆడబిడ్డల వివాహాలకు లక్ష రూపాయల వరకు 4% వడ్డీతో ( పావలా వడ్డీ మాత్రమే) రుణాలు అందిస్తారు. SERP స్త్రీనిధి బ్యాంకు ద్వారా 48 గంటల్లోనే నిధులు ఖాతాలో జమ అవుతాయి. ఈ రుణాన్ని 48 సులభ వాయిదాలలో చెల్లించవలసి ఉంటుంది. రుణం తీసుకున్న సభ్యురాలు మరణిస్తే, రుణం మాఫీ అవుతుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *