సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కూటమి ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు చంద్రబాబు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ‘తల్లికి వందనం‘ కార్యక్రమం కోసం విధివిధానాలు ఖరారు చేస్తూ తాజగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ పథకం ద్వారా ఒక్కొక్క పేద విద్యార్థికి 15 వేల రూపాయల ఆర్థిక సాయం, విద్యార్థులకు కిట్స్ పంపిణీకి ఉత్తర్వులు విడుదలయ్యాయి. ప్రభుత్వ ఉద్యోగి మినహా.. పేదవారి ఇంటిలో ఎంత మంది పిల్లలు ఉన్నసరే..ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటె 30వేలు వస్తుంది. ఈ పథక లబ్ధిదారుల గుర్తింపునకు ఆధార్ కార్డుతో పాటు ప్రభుత్వ గుర్తింపుతో ఉన్న ఇతర కార్డులు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ పథకం కింద రూ.15 వేలతో పాటు విద్యార్థులకు బ్యాగు, బూట్లు, బెల్టు, సాక్సులు, పుస్తకాలు, యూనిఫాం ఇస్తారు. లబ్ధిదారులు ఐడెంటిటీగా కింది వాటిలో ఏదైనా ఒకదాన్ని వాడొచ్చు..ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఫొటో ఉన్న బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్ బుక్, పాన్ కార్డు రేషన్ కార్డు, ఓటర్ ఐడెంటిటీ కార్డు, ఎంజీఎన్ఆర్ఈజీఏ కార్డు, ఫొటో ఉన్న కిసాన్ కార్డు, గెజిటెడ్ ఆఫీసర్ లేదా తహసీల్దార్ అఫిషియల్ లెటర్ హెడ్, ఏదైనా డిపార్ట్మెంట్ డాక్యుమెంట్
