సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పండుగలు శుభ ముహుర్తాలు నేపథ్యంలో ఆంధ్ర ప్రదేశ్ మీదుగా రద్దీ రూట్లలో వేసిన 15 ప్రత్యేక రైళ్లను వచ్చే నవంబరు నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన అధికారులు.. తాజాగా మరో 22 రైళ్లను పొడిగిస్తూ నేడు, గురువారం నిర్ణయం తీసుకున్నారు. దీంతో రైల్వే ప్రయాణికులకు ఈ రెండు నెలల పాటు ప్రత్యేక రైళ్ల టికెట్స్ ఫై అదనపు ఛార్జీల రూపంలో ప్రత్యేక బాదుడు కూడా తప్పదు.
