సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: అమరావతి లో నేడు, శుక్రవారం ఏపీ రాష్ట్ర సచివాలయంలో మునిసిపల్/కార్పొరేషన్ ఉద్యోగుల సమస్యలు ను పరిష్కరించవలసిందిగా కోరుతూ మునిసిపల్ ఉద్యోగుల రాష్ట్ర అధ్యక్షులు, కృష్ణ మోహన్ ( భీమవరం) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, వై.శ్రీలక్ష్మి మరియు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి, కోటేశ్వరరావు మరియు పురపరిపాలనా మరియు పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు ను కలసి తమ విన్నతులను వారి దృష్టికి తెచ్చారు. మునిసిపల్ ఉద్యోగులకు సకాలంలో పదోన్నతులు, కార్పొరేషన్ ఉద్యోగుల సీనియారిటీ లో వ్యత్స్యాసాలు, వార్డు సచివాలయలకు సూపర్ డెంట్ పోస్టులు మంజూరు,సచివాలయ ఉద్యోగుల సమస్యలు, కారుణ్యానియమకాలు లో CPT పరీక్షల్లో ఉత్తీర్ణతలు యందు ఇప్పటినుండి 2 ఏళ్ల కాలపరిమితి మంజూరు, నూతన మునిసిపాలిటీ లు మరియు కార్పొరేషన్స్ లకు పోస్టులు మంజూరు మరియు ఇతర ముఖ్యసమస్యలు పూర్తి అయ్యేవరకు జాయింట్ మీటింగులు ఏర్పాటు కోరుతూ చర్చించారని, వాటికీ సావధానంగా విన్న .అధికారులు సానుకూలంగా స్పందించారు.అని తెలిపారు. .ఈ కార్యక్రమంలో s. నాయిడుబాబు ( జనరల్ సెక్రటరీ) s.నరసింహులు(ఉపాధ్యక్షులు) , S. వెంకటేష్ (కోశాధికారి), v.నాగేశ్వరరావు( స్పోర్ట్స్ & కల్చరల్ సెక్రటరీ) A. శ్రీనివాస్ ( మీడియా సెక్రటరీ) మరియు సంఘ నాయకులు GS అశోక్, హెఛ్ .వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
